హుబ్లీ: నగరంలో వివిధ చోట్ల ఇస్పేట్ జూదం ఆడుతున్న అడ్డాలపై పోలీసులు దాడి చేసి 91 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఏపీఎంసీ నవనగర 3, ధార్వాడ టౌన్ 3, విద్యాగిరిలో 3, పాత హుబ్లీ 2, కేశ్వాపుర 1, ఉపనగర 1, హుబ్లీ టౌన్ 1తో పాటు 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 14 కేసులు నమోదయ్యాయి.
అబుల్ కలాం ఆజాద్ జయంతి
రాయచూరు రూరల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఆచరించారు. డీసీసీ అధ్యక్షుడు శాంతప్ప చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. దేశ విద్యా రంగానికి అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఇస్మాయిల్, ఫారూక్, దస్తగిరి తదితరులున్నారు.
ఓబవ్వ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, కన్నడ సంస్కృతి శాఖ, ఒనకె ఓబవ్వ సమాజం ఆధ్వర్యంలో ఓబవ్వ జయంతిని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి ఒనకె ఓబవ్వ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలను కొనియాడారు. నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, తహసీల్దార్ సురేష్ వర్మ, సిండికేట్ సభ్యుడు మల్లేష్, రవిలున్నారు.
వేడుకగా శ్రీవారి కళ్యాణోత్సవం
రాయచూరు రూరల్ : నగరంలో మూడు రోజుల పాటు జరిగే శ్రీవారి కళ్యాణోత్సవం వేడుకగా సాగింది. బుధవారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో వెలసిన వేంకటేఽశ్వర స్వామి పవిత్రోత్సవ సేవలో నారాయణపేట మాజీ శాసన సభ్యుడు ఎస్.రాజేంద్రరెడ్డి దంపతుల పట్టు వస్త్రాలతో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాత సేవ, పరిమళ ఆరాధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వంటి పూజాకై ంకర్యాలు నెరవేర్చారు.
చోరీ సొమ్ము జప్తు ..
నిందితుడు అరెస్టు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసును గోకుల్ రోడ్డు పోలీసులు చేధించారు. నిందితుడిని అరెస్ట్ చేసి 33 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి వస్తువుల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అజయ్ (20)గా గుర్తించారు. కాగా ఈ కేసు మిస్టరీ చేధించిన పోలీస్ సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ భూషన్ బుర్సే ప్రశంసించారు.
ఆన్‌లైన్‌లో రూ.లక్షలాది వంచన
హుబ్లీ: ఆన్‌లైన్ రిజర్వేషన్ టాస్క్ పూర్తి చేస్తే ఎక్కువ కమీషన్ ఇస్తామంటూ నమ్మించిన సైబర్ వంచకులు నగర వ్యాపారి వినాయక్ (41)ని రూ.15.69లక్షలు దోచుకుని వంచించారు. ఈ నెల 2 నుంచి 6 వరకు నకిలీ వెబ్‌సైట్, టెలిగ్రాం ద్వారా వినాయక్‌ను సంప్రదించిన వంచకులు టాస్క్ పేరిట దశల వారీగా ఆ మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జైన్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి
హుబ్లీ: మైనార్టీలైన జైన్ సమాజం అభివృద్ధి, వారి సంక్షేమం కోసం ప్రత్యేక మైనార్టీ జైన్ అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆ సమాజ బాంధవులు డిమాండ్ చేశారు. సంస్థ దిగంబర్ జైన్ సమాజం, ట్రస్ట్, సన్మతి సేవ సమాజం, సమేక్ ప్రజ్ఞ మహిళా మండలి, ప్రియకారిణి సన్మతి సమాజం, జైన్ మిలన్ కేంద్రం తదితర సంస్థలు వరూరు జైన్ మఠం దిగంబర్ ముని గుణధరనంది ముని సారథ్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్పొరేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని జైన్ సమాజ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ట్రస్ట్‌ల అధ్యక్షులు, పదాధికారులు, సమాజ ప్రముఖులు పాల్గొన్నారు.


