వీరనారి ఒనకె ఓబవ్వకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

వీరనారి ఒనకె ఓబవ్వకు ఘన నివాళి

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

హొసపేటె: బ్రిటిష్‌ పాలకుల కాలంలోనే కాకుండా, శత్రువుల దాడులను ధైర్యంగా ఎదుర్కొని కన్నడ నేల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన వీరనారి ఒనకె ఓబవ్వ జయంతి వేడుకలు విజయనగర జిల్లా అధికారిణి కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారిణి కార్యాలయంలో ఒనకే ఓబవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ధైర్యసాహసాలు, దేశభక్తి, పోరాట పటిమను స్మరించుకున్నారు. చిత్రదుర్గ కోటపై శత్రువులు దాడి చేసినప్పుడు, చేతిలో రోకలిబండ(ఒనకె)ను ఆయుధంగా చేసుకుని శత్రు సైనికులను ఎదుర్కొన్న ఒనకె ఓబవ్వ వీరగాథ నేటి తరానికి స్పూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. ఒనకె ఓబవ్వ ఆశయాలు, సాహసగాథలను యువత ఆదర్శకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని వీరనారికి ఘన నివాళులర్పించారు.

విజయనగర జిల్లా అధికారిణి కార్యాలయంలో జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement