పీజీ వైద్యురాలి కలలు భగ్నం | - | Sakshi
Sakshi News home page

పీజీ వైద్యురాలి కలలు భగ్నం

Jun 6 2023 7:06 AM | Updated on Jun 6 2023 7:02 AM

- - Sakshi

పిల్లల డాక్టర్‌ కావాలని మా అన్న కూతురు దర్శిని పీడియట్రిక్‌ ఎండీ చేస్తోంది.

కోలారు: చదువుల ఒత్తిడి, వేధింపులను తట్టుకోలేక మెడిసిన్‌ పీజీ విద్యార్థిని జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కోలారు తాలూకాలోని నరసాపురం వద్ద ఉన్న క్వారీ నీటి గుంతలో పడి ఆత్మహత్య చేసుకుంది. బళ్లారి నగరానికి చెందిన దర్శిని (25) మృతురాలు. వివరాలు.. దర్శిని బెంగుళూరు రూరల్‌ జిల్లా హొసకోట వద్ద ఉన్న ఎంవిజి మెడికల్‌ కళాశాలలో పీడియాట్రిక్‌ (పిల్లల వైద్యం)లో ఎండీ కోర్సు చదువుతోంది.

ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కళాశాల నుంచి బయలుదేరి కోలారు తాలూకా కెందట్టి వద్ద ఉన్న క్వారీ నీటి గుంత వద్దకు చేరుకుంది. చివరిసారిగా తన స్నేహితుడు మణి అనే వ్యక్తికి ఫోన్‌ చేసి కొంతసేపు మాట్లాడింది. తాను చనిపోతున్నట్లు అతనికి చెప్పింది. తరువాత చెప్పులు, ఫోన్‌ను గట్టున పెట్టి క్వారీ నీటి గుంతలో దూకింది. మరోవైపు మణి ఈ విషయాన్ని అందరికి చెప్పి అక్కడికి వెళ్లాలని చెప్పాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి శవమై తేలింది.

విపరీతమైన పని ఒత్తిడి?
చదువులో ప్రతిభావంతురాలైన దర్శిని ప్రభుత్వ కోటాలోనే ఎండీ సీట్‌ దక్కించుకుంది. ఏడాది కిందట తండ్రిని కోల్పోయిన దర్శినికి తల్లి ఉంది. ఊళ్లో ఆస్పత్రి పెట్టి ప్రజలకు సేవ చేయాలని తలచేది. కానీ మెడికల్‌ కళాశాలలో రోజులో 24 గంటలూ తమతో పని చేయించుకుంటున్నారని, విశ్రాంతి అనేదే లేదని తన స్నేహితుని వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.

కళాశాలలోని సీనియర్‌ వైద్యుడు మహేష్‌ దర్శినిని వేధించేవాడని ఆమె బంధువులు శ్రీనివాస్‌, హనుమంతప్పలు ఆరోపించారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది కలిసి మృతదేహాన్ని వెలికితీసి సోమవారం ఎంవీజీ ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కోలారు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

వేధించడం వల్లనే: చిన్నాన్న
మృతురాలి చిన్నాన్న శ్రీనివాస్‌ మాట్లాడుతూ పిల్లల డాక్టర్‌ కావాలని మా అన్న కూతురు దర్శిని పీడియట్రిక్‌ ఎండీ చేస్తోంది. దర్శినిది చిన్న పిల్లల మనసత్త్వం. సీనియర్‌ వైద్యుల వేధింపుల వల్లనే దర్శిని నీటిలో పడి ఆత్మహత్య చేసుకుంది. దీనికి మెడికల్‌ కళాశాలనే బాధ్యత వహించాలి, ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement