బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి

- - Sakshi

కర్ణాటక: జేడీఎస్‌ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం హెచ్‌.డీ.కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తాత్కాలిక స్పీకర్‌ ఆర్‌.వీ.దేశపాండే ఆఫీసులో జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

మాజీ మంత్రి హెచ్‌.డీ.రేవణ్ణ, పార్టీలోని 19 మంది కొత్త ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీఎస్‌ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమార మాట్లాడుతూ ఓడిపోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top