సోమేశ్వర బ్రహ్మ రథోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మాగడి పట్టణంలోని చారిత్రక ప్రసన్న సోమేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయమే సోమేశ్వర ఆలయంలో రుద్రహోమం తదితర పూజా వేడుకలను చేపట్టారు. మధ్యాహ్నం 12.40 నుంచి 1.30 గంటల మధ్య శుభ ముహూర్తంలో ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఉంచి తేరును ఊరేగించారు. మంగళవాయిద్యాల మధ్య భక్తులు స్వామిని జపిస్తూ తేరును లాగారు. అరటిపండ్లు, దవనాలను తేరు మీదకు విసిరారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే రథాన్ని సగం దూరం మాత్రమే లాగారు. సాయంత్రం మిగిలిన దూరాన్ని మళ్లీ లాగారు. ఎమ్మెల్యే హెచ్.సి.బాలకృష్ణ, హెచ్.ఎం.రేవణ్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రూ 20 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఆలయానికి కొత్త తేరును తయారు చేయిస్తున్నట్లు చెప్పారు.
మాగడిలో భక్త సందోహం


