మద్యంపై అసెంబ్లీలో రచ్చ | - | Sakshi
Sakshi News home page

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

Jan 28 2026 7:19 AM | Updated on Jan 28 2026 7:19 AM

మద్యం

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

ఓ వైపు అసెంబ్లీలో ఉభయ సభలు నడుస్తున్నాయి. మరోవైపు అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌లు ఆందోళనలకు దిగాయి. సీఎం, డీసీఎంలు ఉపాధి హామీకి మద్దతుగా స్వతంత్రపార్కులో బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని మట్టిలో కలిపేస్తోందని ఆరోపించారు. ఎకై ్సజ్‌ మంత్రి అవినీతిలో ముఖ్యమంత్రికి వాటా ఉందని, మంత్రిని తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.

బెంగళూరు స్వతంత్ర పార్కులో కాంగ్రెస్‌ ఆందోళనలో కార్యకర్తలు

ధర్నాలో పాల్గొన్న సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్‌, మంత్రులు, నేతలు

బనశంకరి: రాష్ట్రంలోని 6 వేల గ్రామ పంచాయతీలకు మహాత్మాగాంధీ పేరు పెడతామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం (మనరేగ)ను రద్దు చేసి కేంద్రం వికసిత భారత్‌ జీ రాం జీ చట్టం తేవడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం బెంగళూరు ఫ్రీడంపార్కులో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేశారు. నేతలు గాంధీ టోపీలు, తలకు పాగాలు ధరించి బైఠాయించారు. నగరం నలుమూలల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.

సిద్దరామయ్య ప్రసంగిస్తూ మహత్మగాంధీ పేరుతో శ్రమ సంస్కృతికి రూపమైన మనరేగ పథకాన్ని రద్దు చేసి జీ రాం జీ యాక్ట్‌ తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాం జీ యాక్ట్‌ను రద్దు చేసేవరకూ తమ పోరాటం జరుగుతుందని, ప్రతి పంచాయతీలో ధర్నా చేస్తామని తెలిపారు. తక్షణం నరేగా ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

జైలుకై నా వెళ్తాం: డీసీఎం

డిప్యూటీ సీఎం డీకే మాట్లాడుతూ మహాత్మగాంధీ పేరు శాశ్వతంగా ఉండేలా పోరాడతామన్నారు. బీజేపీ నాయకులు గాంధీ విగ్రహం ముందు కూర్చునే హక్కు కోల్పోయారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మళ్లీ గాంధీజీని హత్య చేసిందని డీకే దుయ్యబట్టారు. నరేగాతో గ్రామాలు అభివృద్ధి చెందితే, బీజేపీ వల్ల దేశంలో నిరుద్యోగమనే రోగం ప్రబలుతోందన్నారు. పోలీసులు తమను అరెస్ట్‌ చేసినా, జైలుకెళ్లయినా సరే నరేగా పథకాన్ని మళ్లీ అమలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కుమారస్వామి, బీజేపీ నేతలు చర్చకు రావాలని, తాను సిద్ధమని చెప్పారు. నరేగాలో అక్రమాలు జరిగినట్లయితే మీరు ఏమి చేస్తున్నారు?, ఎవరో కొందరు తప్పుచేస్తే ఈ పథకాన్ని మార్చేస్తారా అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికుల హక్కులను లాగేస్తోందన్నారు. త్వరలో ప్రతి పంచాయతీలో నరేగా కార్మికులతో 5 కిలోమీటర్ల పాదయాత్ర చేపడతామని తెలిపారు.

చలో రాజ్‌భవన్‌

తరువాత సీఎం, డీసీఎం, మంత్రులు తదితరులు చలో రాజ్‌భవన్‌ ముట్టడికని బయల్దేరగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ.వేణుగోపాల్‌, రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా కూడా ఉన్నారు. ఆపై గవర్నర్‌ గెహ్లాట్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వరుస ఆందోళనలతో బెంగళూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

గవర్నర్‌నే అవమానిస్తారా?

పోటాపోటీగా నిరసనలు

ఉపాధి హామీ చట్టం కోసం స్వతంత్రపార్కులో సీఎం, డీసీఎం,

మంత్రుల ధర్నా

గవర్నర్‌ను కించపరిచారని అసెంబ్లీ

ఆవరణలో బీజేపీ, జేడీఎస్‌ ఆందోళన

నేడు చర్చకు స్పీకర్‌ హామీ

యశవంతపుర: మంగళవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఎకై ్సజ్‌ శాఖలో అవినీతి ఆరోపణలపై విధానసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. అవినీతిపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ ఖాదర్‌ పోడియం ముందుకెళ్లి పట్టుబట్టారు. జీరో అవర్‌లో సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇస్తానని తెలిపారు. కానీ ఎకై ్సజ్‌శాఖలో జరిగిన అవినీతిపై చర్చ జరగాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ అవినీతిలో మంత్రితో పాటు సీఎంకు కూడా భాగం ఉందన్నారు. రోడ్లపై ప్రజలు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారన్నారు. బుధవారం దీని మీద చర్చిద్దామని సభాపతి నచ్చజెప్పడంతో విరమించుకున్నారు.

అబ్కారీ మంత్రిని తొలగించాలి

అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులను పదవుల నుంచి తొలగించకుండా పరిపాలన చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి ఆరోపించారు. ఆయన పరిషత్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ఎకై ్సజ్‌శాఖలో రూ. 4 వేల కోట్ల అవినీతి జరిగిందని, మద్యం వ్యాపారుల సంఘం నుంచి రూ.6 వేల కోట్లు తీసుకున్నారన్నారు. ఈ డబ్బులు ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అబ్కారీ మంత్రిని తక్షణం బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

మద్యం పేరుతో అవినీతి దందా

సౌధ ఆవరణలో ప్రతిపక్షాల ధర్నా

బనశంకరి: రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానం చేసిందని, అబ్కారీశాఖ అవినీతిమయమైందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బీవై.విజయేంద్ర, బీజేపీ పక్షనేత ఆర్‌.అశోక్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జేడీఎస్‌ నాయకులు విధానసౌధ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు. అసెంబ్లీ సమావేశ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గవర్నర్‌పై గూండాగిరి చేశారని, వారిని సస్పెండ్‌చేయాలని డిమాండ్‌ చేశారు. ఎకై ్సజ్‌ శాఖలో భారీఎత్తున అవినీతి జరిగింది, ఆ శాఖ మంత్రి ఆర్‌బీ.తిమ్మాపుర రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ ఎకై ్సజ్‌ శాఖలో అవినీతి జరిగింది, ఇందులో ముఖ్యమంత్రికి భాగం ఉందని లేకపోతే ఎకై ్సజ్‌ మంత్రితో రాజీనామా చేయించేవారని విమర్శించారు. సిద్దరామయ్య కు ఎకై ్సజ్‌శాఖలో అక్రమాలు కనబడటం లేదా, ధృతరాష్టుని మాదిరిగా కళ్లు మూసుకుని కూర్చున్నారా? అని ధ్వజమెత్తారు. మంత్రి రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి జీ రాం జీ చట్టంపై ఆందోళనలు చేస్తోందన్నారు. మద్యం బానిసల రాష్ట్రంగా మారుస్తోందన్నారు.

మద్యంపై అసెంబ్లీలో రచ్చ 1
1/6

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

మద్యంపై అసెంబ్లీలో రచ్చ 2
2/6

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

మద్యంపై అసెంబ్లీలో రచ్చ 3
3/6

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

మద్యంపై అసెంబ్లీలో రచ్చ 4
4/6

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

మద్యంపై అసెంబ్లీలో రచ్చ 5
5/6

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

మద్యంపై అసెంబ్లీలో రచ్చ 6
6/6

మద్యంపై అసెంబ్లీలో రచ్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement