అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
రాయచూరు రూరల్: రాయచూరు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉండగా అదనంగా అణు విద్యుత్ స్థావరాలను ఏర్పాటు చేయడం తగదని రాయచూరు నాగరిక వేదిక సంచాలకుడు బసవరాజ్ కళస పేర్కొన్నారు. సోమవారం భారతీయ వైద్య సంఘం సభాభవనంలో పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పలు ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. శక్తినగర్ వద్ద రెవెన్యూ శాఖ, జిల్లా యంత్రాంగం అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కృష్ణా నది సమీపంలో కేంద్ర విద్యుత్ ప్రాధికార నుంచి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ త్రిసభ్య కమిటీలతో కూడిన బృందం భూమిని పరిశీలించి వెళ్లినట్లు తెలిపారు. అణు విద్యుత్ స్థావరాలను నెలకొల్పితే కృష్ణా నది నీరు మలినం కావడం, మనిషి ఆయుష్షు క్షీణించడంతో పాటు వాటి బారిన పడి క్యాన్సర్ వ్యాది సోకి వినాశనానికి దారి తీసే పరిశ్రమల ఏర్పాటుకు ససేమిరా అంగీకరించరాదన్నారు. సమావేశంలో చామరస మాలి పాటిల్, అనిత, మారెప్ప, పద్మ, వీరేష్, మహావీర్, శ్రీశైలేష్‌లున్నారు.


