గోవిందా హరి గోవింద
కోలారు: ముళబాగిలు తాలూకా దొడ్డగుర్కి గ్రామంలో వెలసిన పురాణ ప్రసిద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 27వ సంవత్సర తిరుప్పావడ మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాతం, వివిధ రకాల సేవలు, పూజలు చేశారు. అర్చకులు భద్రినాథ్ నేతృత్వంలో నిర్వహించారు. దేవాలయాన్ని తోరణాలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు.
పిల్ల పులి పట్టివేత
మైసూరు: చామరాజనగర తాలూకాలోని అటవీ ప్రాంతంలో నంజదేవనపుర గ్రామంలో తల్లి పులి నాలుగు పిల్లలతో తిరుగుతుండగా అటవీ అధికారులు కార్యాచరణ చేపట్టారు. తల్లి, 2 పిల్లలను ఇటీవల బంధించారు. సోమవారం రాత్రి బోను పెట్టి మరో పిల్ల పులిని పట్టుకున్నారు. దీంతో 4 దొరికాయి, మరొక పిల్ల ఆచూకీ లేదు. డ్రోన్లు, ఏనుగులతో గాలింపు జరుగుతోంది.
సంతాన సంతోషం
● ఒకే కాన్పులో ముగ్గురు జననం
మైసూరు: సంతానలక్ష్మి కరుణించిందో ఏమో.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ విడ్డూరం జరిగింది. మండ్య జిల్లాలోని అక్కిహెబ్బళకు చెందిన 28 ఏళ్ల గర్భిణి నెలలు నిండడంతో ఇక్కడి శంకర్ నర్సింగ్ హోమ్‌లో చేరింది. సోమవారం కాన్పు కాగా, ఒక పాప, ఇద్దరు మగపిల్లలు జన్మించారు. పాప 1.5 కేజీలు, ఓ అబ్బాయి 1.8, మరొకరు 2.5 కిలోల బరువు ఉన్నారు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. శిశువులు, తల్లీ ఆరోగ్యంగా ఉన్నారు. పిల్లలను ఇంక్యుబేటర్‌లో ఉంచి సంరక్షిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో తల్లికి అప్పగిస్తామని వైద్యులు తెలిపారు.
కారును వెంటాడిన గజరాజు
మైసూరు: చామరాజనగర జిల్లాలోని కర్ణాటక– తమిళనాడు సరిహద్దుల్లో ఓ ఏనుగు కారును వెంటాడింది, మంగళవారం తెల్లవారుజామున సత్యమంగళ అభయారణ్యం రహదారిలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రహదారిలో ఈ ఘటన జరిగింది. అడవిలో నుంచి బయటకు వచ్చిన ఏనుగు రోడ్డుపై వెళుతున్న వాహనాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది, ఓ కారును వెంబడించగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ సత్యమంగళ, బిళగిరి పులి అభయారణ్యాలు కలుస్తాయి, దీంతో ఏనుగుల సంతతి ఎక్కువ. తరచూ రోడ్లపై తిరుగుతూ బస్సులను, చెరుకు లారీలను అడ్డుకుంటూ భయోత్పాతాన్ని కలిగిస్తుంటాయి. కర్ణాటక అటవీ సిబ్బంది ఆ రహదారిలో ఉంటూ ఏనుగులు రాకుండా చర్యలు చేపట్టారు.
పైళ్లెన 2 నెలలకే
భార్య పరారీ
● నవ వరుడు ఆత్మహత్య
సాక్షి బళ్లారి: పైళ్లెన రెండు నెలలకే భార్య ప్రియునితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమెకు మేనమామ– భర్త అయిన నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న బాధాకర సంఘటన దావణగెరె జిల్లా గుమ్మనూరులో జరిగింది. గ్రామానికి చెందిన హరీష్ (32) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొననాడు. డెత్‌నోట్‌లో తన భార్య వేరొకరితో వెళ్లిపోవడమే కారణమని, తన చావుకు భార్య, అత్త, మామలతో పాటు భార్యను తీసుకెళ్లిన ప్రియుడు కుమార్ కూడా కారణమని పేర్కొన్నాడు. భార్య తనపై లేనిపోని ఆరోపణలు చేసి బెదిరించిందని, దీంతో తాను ఇక జీవించలేక పోతున్నానని, అంత్యక్రియలు బసవధర్మం ప్రకారం నిర్వహించాలని రాశాడు. దావణగెరె గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
గోవిందా హరి గోవింద
గోవిందా హరి గోవింద


