ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
మైసూరు: జిల్లాలో సీఎం సిద్దరామయ్య ఎన్నికై న వరుణ నియోజకవర్గంలో అమితాబ్, భార్య సుష్మ తమ మీద కాంగ్రెస్ నేత దాడి చేశాడని, దీనిపై ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వరుణ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రాజు, కొన్ని రోజుల క్రితం హెబ్యా గ్రామంలో అమితాబ్, సుష్మల ఇంటిలోకి చొరబడి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ భూమిని తనకు రాసివ్వాలని రాజు ఒత్తిడి చేయగా, అమితాబ్ తిరస్కరించాడు, దీంతో దాడి, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. తలపై రాళ్లతో కొట్టడంతో గాయపడినట్లు అమితాబ్ చెప్పాడు. నాకు సిద్ధరామయ్య తెలుసు, యతీంద్ర తెలుసు అని రాజు తరచూ బెదిరిస్తున్నాడని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా బెదిరింపులు ఆగలేదన్నాడు. దీంతో న్యాయం కోసం ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
సీఎం నియోజకవర్గంలో దంపతుల గోడు


