కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు: టచ్‌లో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు: టచ్‌లో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

May 13 2023 7:16 AM | Updated on May 13 2023 12:02 PM

- - Sakshi

ఆలూ లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో.!

సాక్షి,బళ్లారి: ఆలూ లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో.! అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని బెళగావికి చెందిన ఎమ్మెల్సీ లఖన్‌ జార్కిహోళి బాంబు పేల్చడం చర్చనీయాంశంగా మారింది. ఆయన శుక్రవారం బెళగావిలో మాట్లాడుతూ శనివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోతే గోవా తరహాలోనే కర్ణాటకలో కూడా రాజకీయ సమీకరణం మారుతుందని జోష్యం చెప్పారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నాయి.

సంకీర్ణం ఏర్పడదు: కోడిహళ్లి స్వామీజీ
కర్ణాటకలో జరగబోయే విషయాలను ఎప్పటికప్పుడు చెబుతూ సంచలనాలకు మారుపేరుగా నిలిచిన కోడిహళ్లి స్వామీజీ ఈసారి కూడా తన వాణిని వినిపించారు. శుక్రవారం విజయనగర జిల్లాకు విచ్చేసిన సందర్భంగా స్వామీజీ మాట్లాడారు. రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్‌ రాదని, ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement