అగ్ని బన్ని రాయ జయంతి | - | Sakshi
Sakshi News home page

అగ్ని బన్ని రాయ జయంతి

Mar 29 2023 12:52 AM | Updated on Mar 29 2023 12:52 AM

చిత్రపటానికి పూజ చేస్తున్న అధికారులు - Sakshi

చిత్రపటానికి పూజ చేస్తున్న అధికారులు

కంప్లి: తిగళ సముదాయ మూలపురుషుడు అగ్నిబన్నిరాయస్వామి సిద్ధాంతాలు, ఆదర్శాలను అలవరుచుకోవాలని తహసీల్దార్‌ గౌసియాబేగం తెలిపారు. ఆమె తాలూకా కార్యాలయంలో అగ్ని బన్నిరాయస్వామి జయంత్యుత్సవంలో పాల్గొని మాట్లాడుతూ దార్శనికుల జీవన సందేశాలు సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. ఉపతహసీల్దార్‌, ఆహార నిరీక్షకులు విరుపాక్షిగౌడ, ఆర్‌ఐ గణేష్‌, శిరస్తిదార్‌ పంపాపతి, ఎస్‌డీ రమేష్‌, వీఏ గిరీష్‌కుమార్‌, విజయకుమార్‌, శివరుద్రయ్య, వనిత, రాధ, రోహిణి, సురేష్‌, హొన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

రాయచూరు రూరల్‌: నగరంలో అగ్ని బన్ని రాయ ఉత్సవాలను మంగళవారం అంబేడ్కర్‌ సర్కిల్‌లో కన్నడ సంస్కృతి శాఖాధికారిణి మంగళ నాయక్‌ ప్రారంభించారు. అనంతరం కన్నడ భవనంలో చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆచార విచారాలను భావి తరాలకు కొనసాగించాలన్నారు.

కోలారు: నగరంలోని టి.చెన్నయ్య రంగమందిరంలో మంగళవారం అగ్ని బన్నిరాయ జయంతిని వైభవంగా నిర్వహించారు. తహసీల్దార్‌ హర్షవర్ధన్‌, కన్నడ సంస్కృతి శాఖ ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, సముదాయ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement