
దావణగెరెలో ఊరేగింపుగా సభాస్థలికి చేరుకుంటున్న ప్రధాని మోదీ
బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ప్రధానికి ప్రజల అభివాదం
సాక్షి, బళ్లారి: దావణగెరెలో నా సోదర, సోదరీమణులకు, కర్ణాటక బీజేపీ కార్యకర్తలకు నమస్కారాలు. దావణగెరెకు వచ్చిన ప్రతిసారీ మీరు చూపిన ప్రేమ, అభిమానాలు నాకు అమిత శక్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన శనివారం దావణగెరెలో జీఎంఐటీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్లు అవసరమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలన్నారు. కాంగ్రెస్ ఆటలను కొనసాగించేందుకు కర్ణాటక ప్రజలు అవకాశం ఇవ్వకూడదన్నారు.
ఎంతో అభివృద్ధి జరిగింది
శివమొగ్గ ఎయిర్‌పోర్టు, హుబ్లీ జంక్షన్, మైసూరు–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే, ధార్వాడ ఐఐటీ క్యాంపస్, జలజీవన్ మిషన్ ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు ఇక్కడ జరిగాయని ప్రధాని అన్నారు. ఇదే తమ అభివృద్ధికి సాఽక్షి అని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో ప్రయోజనాలు చూపించామన్నారు. రాష్ట్రంలో 40 లక్షల కొత్త కొళాయిలు ఏర్పాటు చేశారన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేది ప్రభుత్వం బీజేపీనే అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని, వాటిని ప్రజలు నమ్మరన్నారు. బెంగళూరు ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప పాల్గొన్నారు.
బెంగళూరులో రోడ్ షో, మెట్రో ప్రయాణం
కృష్ణరాజపురం: శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్న ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. కేఆర్‌పురం– వైట్‌ఫీల్డ్ మధ్య నూతన మెట్రో రైలు మార్గాన్ని అంకితం చేశారు. వైట్‌ఫీల్డ్ స్టేషన్‌లో టికెట్ కొని మెట్రో రైలులో ఆయన ప్రయాణించారు. గవర్నర్ గెహ్లాట్, సీఎం బొమ్మై తదితరులు ఆయనతో ఉన్నారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని మాటామంతీ నిర్వహించారు. తరువాత చిక్కబళ్లాపురం వద్ద సాయి వైద్య విద్యాసంస్థను ప్రారంభించారు. ప్రఖ్యాత నిర్మాణకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమాధిని, మ్యూజియాన్ని ప్రధాని సందర్శించారు.
దావణగెరె సభలో ప్రధాని నరేంద్ర మోదీ
బెంగళూరు, చిక్కబళ్లాపురలో
విస్తృత పర్యటన
మెట్రో రైల్లో ప్రయాణం


మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియంలో..

మెట్రో రైలులో విద్యార్థులతో ప్రధాని మోదీ

చిక్కబళ్లాపుర వద్ద ముద్దేనహళ్లిలో మోక్షగుండం సమాధికి మోదీ శ్రద్ధాంజలి

కేఆర్ పురం– వైట్‌ఫీల్డ్ మధ్య ప్రధాని ప్రయాణించిన మెట్రో రైలు