దీక్షా దివస్‌కు తరలిరండి | - | Sakshi
Sakshi News home page

దీక్షా దివస్‌కు తరలిరండి

Nov 28 2026 11:50 PM | Updated on Nov 28 2026 11:50 PM

సభకు సర్వం సిద్ధం

మానకొండూర్‌: మహోన్నత చరిత్ర కలిగిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగు ల కమలాకర్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం అలుగునూరులో నిర్వహించే దీక్షా దివస్‌ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎంపీ బాల్కసుమన్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావుతో కలిసి ఏర్పాట్లు పరి శీంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కరీంనగర్‌కు 3.30 వస్తారని, 4గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నగరశాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ పాల్గొన్నారు.

కరీంనగర్‌ టౌన్‌: కరీంనగర్‌ గులాబీమయంగా మారింది. బీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపుగా మారిన నవంబర్‌ 29ని గుర్తు చేసుకుంటూ నేడు నిర్వహించే దీక్షా దివస్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలుగునూర్‌లోని వరంగల్‌ రోడ్డులో 40 ఎకరాల్లో సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే సభకు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌, కోరుట్ల ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement