విద్యా విప్లవానికి పూలే నాంది | - | Sakshi
Sakshi News home page

విద్యా విప్లవానికి పూలే నాంది

Nov 28 2026 11:50 PM | Updated on Nov 28 2026 11:50 PM

● డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం

● డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: విద్యా విప్లవానికి జ్యోతిబా పూలే నాంది పలికారని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉన్న జ్యోతి బాపూలే విగ్రహానికి శనివారం పూలమాల వేసి నివాళి అర్పించారు. సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, బీసీ సెల్‌ అ ధ్యక్షుడు పులి ఆంజనేయులు, కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం ఉన్నారు.

ఆరుతడి పంటలు వేయాలి

జమ్మికుంట: ఎల్‌నివో నేపథ్యంలో రైతులు ఆ రుతడి పంటలు వేయాలని డీఏవో ఛత్రునాయ క్‌ సూచించారు. మండలంలోని తనుగుల రైతువేదికలో శనివారం రైతునేస్తం అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ రైతులు వరిసాగు తగ్గించి, జొన్న, పెసర, మినుము, కుసుమ, పొద్దుతిరుగుడు, శెనగ పంటలు సాగు చేయాలన్నారు. ఆకుకూరల సాగుతో తక్కువకాలంలో ఆదా యం పొందవచ్చన్నారు. కరువు మండలాల్లో ని రైతులు డిసెంబర్‌ 8 వరకు బ్యాంకును సంప్రదించి పంట రుణాలు రీషెడ్యూల్‌ చేసుకోవాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి సురేంద్రమోహన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పొల్సాని వెంకటేశ్వరరావు, ఏవో ఖాదర్‌హుస్సేన్‌, సర్పంచ్‌ జక్కె కిరణ్‌ పాల్గొన్నారు.

ముగిసిన నవోదయ పరీక్ష

చొప్పదండి: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ప్రిన్సిపాల్‌ కె.బ్రహ్మానందరెడ్డి తెలిపారు. 20 పరీక్ష కేంద్రాల్లో 3,289 మంది హాజరు కాగా 85శాతంగా నమోదైంది. కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో తిరుపతి పర్యవేక్షణలో ప్రత్యేక పర్యవేక్షకులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

ఉత్సాహంగా 2కే రన్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా జరగనున్న జూడో పోటీలకు కరీంనగర్‌ ఆతిథ్యం ఇస్తున్న సందర్భంగా క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు జిల్లాకేంద్రంలో శనివారం 2కే రన్‌ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలకు కరీంనగర్‌ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: డీటీఆర్‌ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.గౌతమినగర్‌ ఫీడర్‌ పరిధిలోని తిరుమల థియేటర్‌, వందన అపార్ట్‌మెంట్‌, మడలేశ్వరస్వామి ఆలయం, వసుధ హోటల్‌ లైన్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

బద్దిపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

విద్యుత్‌ స్తంభాల పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 33/11 కె.వీ.బద్దిపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలోని కమాన్‌పూర్‌, బద్దిపల్లి, నాగులమల్యాల, వ్యవసాయ సర్వీసులతో పాటు గ్రానైట్‌ పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement