భూ రీసర్వే వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

భూ రీసర్వే వేగవంతం చేయండి

Nov 28 2026 11:50 PM | Updated on Nov 28 2026 11:50 PM

● రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి ● కలెక్టర్‌ చిత్రామిశ్రా ● నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

● రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి ● కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: భూముల రీ సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. రీ సర్వే నిర్వహించే గ్రామాల్లో రైతులకు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. వారి సహకారంతో సర్వే చేపట్టాలని సూచించారు. శనివారం ఐడీవోసీలోని తన చాంబర్‌లో హుజూరాబాద్‌ డివిజన్‌ పరిధిలో భూముల రీ సర్వే ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తయిన సర్వే వివరాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. హుజూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ధర్మారం, ధర్మరాజుపల్లి, పాతర్లపల్లి, రామచంద్రాపూర్‌, విలాసాగర్‌ గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్‌ వెల్లడించారు. మరో 11 గ్రామాల్లో సర్వే కొనసాగుతోందని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీవో జలకుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ ఎస్‌.కిషన్‌రావు పాల్గొన్నారు.

జాబ్‌ మేళాకు విశేష స్పందన

పాత కలెక్టరేట్‌ వేదికగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగాజాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. 17 కంపెనీలు పాల్గొన్నాయి. ఎంపికై నవారికి అక్కడికక్కడే నియామకపత్రాలు అందజేశారు. ప్రైవేట్‌ రంగంలో ఉపాధి అవకాశాలను గుర్తించి, నిరుద్యోగ యువతకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కలెక్టర్‌ చిత్రామిశ్రా స్పష్టం చేశారు.

17 కంపెనీలు.. 294 మంది అభ్యర్థులు

జాబ్‌మేళాలో 17కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా జిల్లావ్యాప్తంగా 294 మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 143మంది షార్ట్‌లిస్ట్‌ కాగా, వారిలో 99 మందికి స్పాట్‌ ఆఫర్‌ లెటర్లు అందజేశారు. మరో 32 మంది ప్రాథమికంగా అర్హత సాధించారు. ఉద్యోగావకాశాలు దక్కించుకున్న అభ్యర్థులను కలెక్టర్‌ అభినందించి, నూతన ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డీఆర్‌వో స్వామి, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు పాల్గొన్నారు.

ఆదాయ మార్గాల పెంపునకు చర్యలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ ఆదాయ మార్గాలు పెంపొందించుకొనేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తెలిపారు. ప్రపంచ బ్యాంక్‌ తరఫున ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ ప్రతినిధులు శనివారం కమిషనర్‌తో సమావేశమయ్యారు. నగరపాలక సంస్థలో ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షించారు. నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ విభాగాల ద్వారా సమకూరుతున్న ఆదాయ వనరులు, పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయ మార్గాలు నగరంలో చేపట్టిన, ప్రతిపాదించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి రుణ మంజూరు వివరాలు, నిధుల వినియోగం తదితర అంశాలను ప్రతినిధులకు కమిషనర్‌ వివరించారు. నగరపాలక సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, గణాంకాల అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement