సృజనాత్మకతకు సైన్స్‌ ఫెయిర్‌ వేదిక | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతకు సైన్స్‌ ఫెయిర్‌ వేదిక

Nov 28 2026 11:50 PM | Updated on Nov 28 2026 11:50 PM

సృజనాత్మకతకు సైన్స్‌ ఫెయిర్‌ వేదిక ● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

సప్తగిరికాలనీ (కరీంనగర్‌): విజ్ఞానశాస్త్రం విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను వెలికితీస్తుందని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో 54వ జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనతో పాటు ఇన్‌స్పైర్‌, పీఎంశ్రీ సైన్స్‌ ఎగ్జిబిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయ ర్‌ మాట్లాడుతూ.. దేశానికి విజ్ఞానశాస్త్రంలో ఘనమైన వారసత్వం ఉందని, విద్యార్థులు దానిని అందిపుచ్చుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రయోగాల్లో వైఫల్యాలకు భయపడకుండా వాటిని కొత్త పాఠాలుగా స్వీకరించాలని సూచించారు. డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, నూత న ఆలోచనలను పెంపొందిస్తాయన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతిరావు, సైన్స్‌ అధికారి చాడ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సుస్థిరాభివృద్ధి కోసం ఆవి ష్కరణలు’ ప్రధాన ఇతివృత్తంగా ఏడు ఉప ఇతివృత్తాల్లో 850కి పైగా వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు 84 ఇన్‌స్పైర్‌, 33 పీఎంశ్రీ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలిచిన ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ ప్రతినిధులు, విద్యాశాఖ అధి కారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement