ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదంతాలు.. | - | Sakshi
Sakshi News home page

ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదంతాలు..

Nov 28 2026 11:50 PM | Updated on Nov 28 2026 11:50 PM

ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదంతాలు..

బోగస్‌ కార్డుల తర్వాత కొత్త తరహా మోసం

ఏడాది క్రితమే మరణించిన వ్యక్తి పేరుతో పరిహారం క్లెయిమ్‌

నామినీలకు తెలియకుండానే బినామీ ఖాతాల్లోకి నగదు మళ్లింపు?

ఇతర జిల్లాల కార్డులను గోదావరిఖనికి బదిలీ చేసి అక్రమాలు

గతంలోనూ బోగస్‌ కార్డులతో రూ.లక్షల్లో స్వాహా

సాక్షి, పెద్దపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి (నర్సింగాపూర్‌)కు చెందిన కొండ వెంకటి 2021 జూన్‌ 3న కరీంనగర్‌లోని రెనే ఆసుపత్రిలో మరణించారు. ఇందుకు కరీంనగర్‌ కార్పొరేషన్‌ మరణ ధ్రువపత్రం జారీ చేసింది. సరిగ్గా ఏడాది తర్వాత.. 2022 జూన్‌ 3న గో దావరిఖని లేబర్‌ ఆఫీస్‌లో సహజ మరణం, అంత్యక్రియల ఖర్చుల కింద క్లెయిమ్‌ నమోదైంది. నామినీకి అందాల్సిన పరిహారం బినామీ ఖాతాల్లోకి మళ్లించారన్నది బాధితుల ఆరోపణ. ఈ మేరకు మరణ ధ్రువపత్రం, రసీదుతో పెద్దపల్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతోంది.

గతంలోనూ బోగస్‌ కార్డులతో స్వాహా

పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన ఓ సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడిని భవన నిర్మాణ కార్మికుడిగా చూపించి, రూ.6.30 లక్షల పరిహారం మంజూరు చేసినట్లు సమాచారం. ఈ మొ త్తాన్ని ఆయన కుమారుడి ఖాతాలో జమ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆయన భార్య, కోడళ్లకు శాశ్వత అంగవైకల్యం ఉన్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఒక్కొక్కరికి రూ.4 లక్షలకు పైగా మంజూరు చేసినట్లు సమాచారం. ఇలా ఒకే కుటుంబానికి రూ.15 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు వారు అర్హులేనా? ధ్రువపత్రాలను ఎవరు పరిశీలించారు? అన్నది తేలాల్సి ఉంది.

ఇతర జిల్లాల కార్డులు.. గోదావరిఖనిలో క్లెయిమ్‌లు!

కరీంనగర్‌, జగిత్యాల, మెట్‌పల్లి, రాజన్న సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన లేబర్‌ కార్డులను గోదావరిఖని కార్యాలయ పరిధికి బదిలీ చేయించుకుని క్లెయిమ్‌లు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు తెలియకుండా, మరికొన్ని సందర్భాల్లో ఎంతోకొంత ముట్టజెప్పి వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలిసింది

సహకరిస్తున్నదెవరు?

లేబర్‌ కార్డు జారీ నుంచి క్లెయిమ్‌ పరిశీలన, పరిహారం మంజూరు, నగదు జమ వరకు ప్రతిదశలో అధికారిక ప్రక్రియ ఉంటుంది. అయినప్పటికీ అక్రమాలు ఎలా జరుగుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టిస్తున్నదెవరు? ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నదెవరు? మీసేవ నిర్వాహకులు, బీమా ఏజెంట్లు, మధ్యవర్తుల పాత్ర ఏమైనా ఉందా? కార్యాలయ స్థాయిలో ఎవరైనా సహకరిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవస రం ఉంది. ఈ వ్యవహారంపై గోదావరిఖని అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదు అందిన మా ట వాస్తవమేనని, విచారణ కొనసాగుతోందని తెలిపారు.

కుమారస్వామి క్లెయిమ్‌: పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన కుమారస్వామి మరణానికి సంబంధించిన క్లెయిమ్‌ శ్రీనివాస్‌ అండ్‌ అదర్స్‌ పేరిట మంజూరైనట్లు సమాచారం. అసలు నామినీ ఎవ రు? పరిహారం ఎవరికి చేరిందన్నది తేలాల్సి ఉంది.

బాలయ్య పేరుతో రూ.6.30 లక్షలు: పెద్దపల్లికి చెందిన గుండేటి బాలయ్య మరణంపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో 2017 జూన్‌ 7న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అయితే 2026 ఫిబ్రవరిలో ఆయన పేరుతో డెత్‌ క్లెయిమ్‌ నమోదు చేసి రూ.6.30 లక్షలు అజయ్‌ అండ్‌ అదర్స్‌ పేరిట మంజూరు చేసినట్లు సమాచారం.

కార్డు జారీ చేసిన ఐదు రోజులకే క్లెయిమ్‌: కమాన్‌పూ ర్‌ మండలం గొల్లపల్లికి చెందిన వ్యక్తికి లేబర్‌ కార్డు జారీ అయిన ఐదు రోజులకే డెత్‌ క్లెయిమ్‌ నమోదైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విచారణ జరి పితే అసలు విషయం బయటపడే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement