కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్: నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో సోమవారం బండి సంజయ్‌కి వినతిపత్రం అందజేశారు. సంజయ్ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
నగర అభివృద్ధికి వేగంగా అడుగులు
కరీంనగర్ అభివృద్ధికి పాలకవర్గం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం నగరంలోని 41వ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్ చౌరస్తాలో యూఐడీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేశారు. నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతామన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, కార్పొరేటర్లు నాంపల్లి రేణుక, చొప్పరి జయశ్రీ పాల్గొన్నారు.


