ప్రకృతిని కాపాడితే ఎల్‌నినోను ఎదుర్కోవచ్చు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిని కాపాడితే ఎల్‌నినోను ఎదుర్కోవచ్చు

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి నీటి పొదుపు, ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన విద్యార్థినులతో ప్రకృతి పరిరక్షణ ప్రతిజ్ఞ

కరీంనగర్‌టౌన్‌: మానవ తప్పిదాల వల్లే వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రకృతి వనరులను పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ ప్రకృతి మిత్రులుగా మారాలని ప్రకృతిమిత్ర తెలంగాణ రా ష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఎస్సీ డిగ్రీ, పీజీ కళాశాల బాలికల వసతి గృహంలో శనివారం ఎల్‌నినో వాతావరణ మార్పులు, కారణాలు, మానవ బాధ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యోగేశ్వర్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ వార్మింగ్‌తో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు ఎల్‌నినోకు కారణమవుతాయని వివరించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచించారు. అనంతరం ఎల్‌నినో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థినులతో ప్రకృతి పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. జీవ రక్షక ట్రస్టు సహకారంతో పర్యావరణ మిత్ర సంచులను పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ముకుందం, ప్రధాన కార్యదర్శి ఎస్‌.హర్జిత్‌ సింగ్‌ తదితరులు పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. తెలంగాణ జానపద గాయని తేలు విజయ ప్రకృతి పాటలతో అలరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement