కరీంనగర్‌స్పోర్ట్స్: అల్గునూర్‌లోని వీజెఆర్ క్రికెట్ స్టేడియంలో కరీంనగర్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ మహిళా ఎమర్జింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. శనివారం జాస్మిన్స్ ఈ, రోజెస్ ఏ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో జాస్మిన్స్ ఈ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప్రతిభ కనబరిచిన రిషితకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మధ్యాహ్నం లోటస్ జీ, లిల్లీస్ సీ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో లోటస్ జీ జట్టు విజయం సాధించింది. జైనబ్ బేగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికై ంది. కార్యక్రమంలో కేడీసీఏ అధ్యక్ష కార్యదర్శులు ఆగంఽ రావు, మనోహర్ రావు, ఉపాధ్యక్షుడు మహేందర్ గౌడ్, టోర్నమెంట్ ఇంచార్జ్ మురళీధర్ రావు, ట్రెజరర్ నంది కుమార్, కమిటీ సభ్యులు విద్యాసాగర్ రావు, అజిత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


