కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు, స్పీకర్,మంత్రులకు, చందనోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రికలు అందజేసినం. భక్తులకు 60 ఏళ్ల అనంతరం స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. ఎమ్మెల్యేగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతం. జీవితంలో ఒకే ఒక్కసారి కలిగే స్వామివారి నిజరూపాన్ని దర్శించుకొని, తరించాలి.
– మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే
రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
కొండగట్టు ఆంజనేయస్వామి చందనోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఇద్దరు జీయర్లతోపాటు 50మంది రుత్వికులు, వేద పండితులతో చందనోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండ, రద్దీకి అనుగుణంగా త్రాగునీటి, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాం. చందనోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలి.
– అంజనా రెడ్డి, కొండగట్టు ఆలయ ఈవో


