పేదలకు ఆర్థిక రక్షణ | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఆర్థిక రక్షణ

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ● 2.85 లక్షల కుటుంబాలకు ఆర్థిక లబ్ధి అంచనా

● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ● 2.85 లక్షల కుటుంబాలకు ఆర్థిక లబ్ధి అంచనా

జగిత్యాల: ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబ పెద్దను కోల్పోయిన విషాద సమయంలో ఇతరులపై ఆధారపడకుండా నిలదొక్కుకునేందుకు రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్‌ 19న సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

● ప్రతి కుటుంబానికి అవకాశం...

ఈ పథకంలో కులం, మతం, ఆదాయం వంటి బేధాలు లేకుండా ప్రతి కుటుంబానికి బీమా రక్షణ కల్పించాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల కుటుంబ సంపాధన సభ్యుడిని బీమా పథకంలోకి తీసుకోనున్నారు. ఒక కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నట్లయితే జీవిత బీమా రక్షణ కల్పించాలనేది కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవాలి.

● నామినీలో కుటుంబ సభ్యులకే స్వేచ్ఛ

ఈ పథకంలో నామిని ఎంపిక బీమా పొందే వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరిని లేదా పలువురిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. బీమా పంపిణీ విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయానికే ప్రాధాన్యత ఉంటుంది. పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు ఆధార్‌కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

● నవంబర్‌ 14 నుంచి 18 వరకు విస్తృత ప్రచారం

ఈనెల 18 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. డప్పు చాటింపు, దండోర ద్వారా ప్రతి ఇంటికి పథకాన్ని చేరవేయనున్నారు.

● ప్రత్యేక కేంద్రాలు నమోదు...

నవంబర్‌ 19న పథకం ప్రారంభమైన అనంతరం గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా అర్హులైన కుటుంబాల నుంచి వివరాలు సేకరించి నమోదు ప్రక్రియ చేపడతారు. నమోదు కేంద్రాల్లో అవసరమైన సమాచారంతో పాటు, దరఖాస్తు ప్రక్రియను అధికారులే బాధ్యులుగా ఉంటారు.

● డిజిటల్‌ విధానంలో నమోదు...

ఈ పథకంలో నమోదు ప్రక్రియ డిజిటల్‌ విధానంలో చేపడుతున్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, అర్హులైన వ్యక్తి ఎంపికలో పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

● 2.85 లక్షల కుటుంబాలకు జీవిత బీమా భరోసా

జగిత్యాల జిల్లాలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 2.85 లక్షల కుటుంబాలకు నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement