ఇంట్లో పేలిన ఫ్రిజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో పేలిన ఫ్రిజ్‌

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

● కాలిపోయిన గృహోపకరణాలు ● ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

● కాలిపోయిన గృహోపకరణాలు ● ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం ఫకీర్‌పేట లో శనివారం ప్రమాదవశాత్తు ఫ్రిజ్‌ పేలిపోవడంతో మంటలు అంటుకుని గృహోపకరాలు కాలిపోయా యి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేల్పుల సురేందర్‌రావు హమాలీగా, భార్య అక్షిత ఉపాధికూలీగా పనిచేస్తున్నారు. శనివా రం యథావిధిగా భార్యభర్తలు పనులకు, ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఉదయం 10.30గంటలకు ఇంట్లో నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు సురేందర్‌రావుకు ఫోన్‌ చేసి చెప్పడంతో వెంటనే వచ్చి తలుపులు తెరిచాడు. అప్పటికే మంటలు అంటుకోవడంతో ఇంట్లోని గృహోపకరాలు కాలిపోగా విద్యుత్‌మోటార్‌తో నీళ్లు పట్టి మంటలను ఆర్పేయడంతో గ్యాస్‌సిలిండర్‌కు అంటుకో లేదు. అయితే ఇంట్లోని నిత్యావసరవస్తువులు, గృహోపకరణాలు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కటే గది కావడంతో గాలి లేక ఒత్తిడితో ఫ్రిజ్‌ పేలిపోయి ఉంటుందని గుర్తించారు. సర్పంచ్‌ బొ ద్దుల విజయలక్ష్మి ఇంటిని పరిశీలించారు. ప్రమా దం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయ ని, కట్టుబట్టలతో ఉండిపోయామని అధికారులు, దాతలు స్పందించి ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని దంపతులు సురేందర్‌రావు, అక్షితలు కోరారు.

వేధింపుల ఆరోపణలపై ఓ కార్పొరేటర్‌పై కేసు

కరీంనగర్‌ క్రైం: నగరంలోని కార్పొరేటర్‌ సోమిడి వేణుప్రసాద్‌పై కరీంనగర్‌ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కిసాన్‌నగర్‌కు చెందిన కల్లెపల్లి కుమార్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. కల్లెపల్లి శివకుమార్‌ కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై నవంబర్‌ 6న కేబుల్‌ బ్రిడ్జి వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తన మరణానికి బీజేపీ కార్పొరేటర్‌ వేణుప్రసాద్‌ కారణమని వీడియోలో ఆరోపించినట్లు ఫిర్యాదులో శివకుమార్‌ తండ్రి కుమార్‌ పేర్కొన్నారు. కుటుంబానికి రాజకీయంగా మద్దతు ఇవ్వకపోవడం, వేధింపులు, బెదిరింపులకు పాల్పడటంతోపాటు ఇంటి నిర్మాణం విషయంలోనూ ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కోర్టు అనుమతితో వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

భార్యను హింసించిన భర్తపై కేసు

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ద్వారకనగర్‌ ప్రాంతానికి చెందిన మాధురిని హింసించిన ఆమె భర్తపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. ద్వారకనగర్‌కు చెందిన మాధురిని ఆమె భర్త రమణ గత కొద్దికాలంగా తీవ్రంగా హింసిస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా రమణ మాధురిని తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రమణపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement