తొలగనున్న దూరభారం | - | Sakshi
Sakshi News home page

తొలగనున్న దూరభారం

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

మానేరుపై వంతెన పనులకు మళ్లీ శ్రీకారం 50 కి.మీ. వరకు తగ్గనున్న ప్రయాణ భారం ఫలించనున్న నలభై ఏళ్ల ఉమ్మడి జిల్లావాసుల కల కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ ప్రజలకు ప్రయోజనం

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట – కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌ మధ్య మానేరుపై చేపట్టిన వంతెన పునఃనిర్మాణంతో ఓరుగల్లు దగ్గరవుతుంది. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో మానేరుపై వంతెన నిర్మాణం కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల కల ఎట్టకేలకు ఫలించనుంది. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పట్టుదలతో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వంతెన నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు చేయించారు. అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి అదనంగా నిధుల కోసం ప్రతిపాదనలను పంపారు. సుమారు కిలోమీటరుకు పైగా పొడవున వంతెన, ఇరువైపులా అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి సునంద కంపెనీ టెండర్లను కై వసం చేసుకుంది.

ఉమ్మడి మూడు జిల్లాలకు ప్రయోజనం..

మానేరుపై వంతెన నిర్మాణంతో మహారాష్ట్రతోపాటు సింగరేణి కార్మికులు, ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల ప్రజలకు 50 కిలోమీటర్ల దూర భారం తగ్గుతుంది. ఓరుగల్లు నుంచి ఖమ్మం, దూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులకు ప్రయాణం సులువుగా మారుతుంది. మానేరు వంతెనతో మహారాష్ట్ర, నాగ్‌పూర్‌ నుంచి వరంగల్‌ మీదుగా ఖమ్మం వరకు సరుకుల రవాణా మరింత దగ్గరవుతుందని వ్యాపారులూ స్వాగతిస్తున్నారు. దీంతోపాటు అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహనాలకు వరంగల్‌ దగ్గరవుతుందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement