జీవితాన్ని గాయం చేసిన విధి | - | Sakshi
Sakshi News home page

జీవితాన్ని గాయం చేసిన విధి

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

● మంచానికే పరిమితమైన కార్మికుడు ● దాతలు ఆదుకోవాలని వేడుకోలు

కాల్వశ్రీరాంపూర్‌: ఒకవైపు అనారోగ్యం.. మరోవైపు అకస్మాత్తుగా జరిగిన ప్రమా దం భవన నిర్మాణ కార్మికుడి జీవితాన్ని మంచానికే పరిమితం చేసింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన కొయ్యెడ సాంబయ్య తాపీ మేసీ్త్ర వద్ద ఇటుకలు అందిస్తూ, సిమెంటు మాలు కలుపుతూ, డ్రైనేజీ పనులకు కూలీగా వెళ్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవా డు. బంధువుల ఇంట్లో ఉంటూ రోజువారీ కూలి సొమ్ముతో నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో విధి వక్రీకరించింది. ఏడాది క్రితం క్యాన్సర్‌ బారినపడ్డాడు. ఆస్పత్రుల్లో వైద్యం చేసుకుంటున్నాడు. అయినా, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూనే ఉన్నాడు. క్యాన్సర్‌ మహమ్మారి చాలదన్నట్లు ఇటుకలు అందిస్తుండగా అదుపుతప్పి ఎడమ కాలుపై పడి తీవ్ర గాయమైంది. ఇన్ఫెక్షన్‌ సోకడంతో కాలు సగం వరకు తొలగించారు. ఓవైపు క్యాన్సర్‌, మరోవైపు ఒకటే కాలుతో నడవడానికీ వీలుకాక మంచానికే పరిమితమయ్యాడు. భార్య శారద, కుమారుడు నరేందర్‌ కూలీ పనులు చేస్తూ మందులకు, సరుకులకు వెచ్చిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. కూలీ పనుల ద్వారా వచ్చే ఆదాయం ఏపూటకాపూటకే సరిపోతోంది. సాంబయ్యకు అవసరమైన మందులు కొనడానికి నెలకు రూ.50 వేలు వెచ్చించాల్సి వస్తోంది. 15 గుంటలు పొలం అమ్మి ఆఫరేషన్‌ కోసం రూ.ఐదు లక్షలు ఖర్చు చేశారు. ఇక ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు. బంధువులు, తెలసిన వారు కూడా అప్పు ఇవ్వక తిండికి గోస పడుతున్నారు. దాతలు, అధికారులు తమను ఆదుకోవాలని సాంబయ్య కుటుంబం చేతులెత్తి వేడుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement