మానేరుపై వంతెన నిర్మాణం ఎంతో సంతోషంగా ఉంది. వంతెన పూర్తయితే మా ఊరి నుంచి జమ్మికుంట అవతల వరంగల్‌కు దగ్గరవుతుంది. గతంలో మానేరు వరదలతో బయట ప్రాంతాలకు తిరిగి పోవాల్సి వచ్చేది. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న వంతెన పనులు మొదలు పెట్టడంతో ఇబ్బందులు తొలగుతాయి.
– కుడుతాల స్వరూప, రూపునారాయణపేట
ప్రభుత్వ విప్‌కు కృతజ్ఞతలు
40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మానేరు వంతెన పనులు మొదలు పెట్టిన ప్రభుత్వ విప్ విజయరమణరావుకు కృతజ్ఞతలు. మానేరు వరదలతో రూపునారాయణపేట నుంచి విలాసాగర్, జమ్మికుంట, వరంగల్‌కు వెళ్లేందుకు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వంతెన నిర్మాణంతో ఇబ్బందులు తొలగుతాయి.
– ఆరెల్లి ఐలయ్య, విలాసాగర్
భారం తగ్గుతుంది
రూపునారాయణపేట – విలాసాగర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన అందుబాటులోకి వస్తే దూర భారం తగ్గుతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తుల్లో ఉత్సాహం నెలకొంది. పనుల్లో వేగం పెంచాలి.
– ఆరెల్లి కుమార్, రూపునారాయణపేట
వరంగల్ దగ్గరవుతుంది
మానేరుపై వంతెన నిర్మాణం పూర్తయితే మా ఊరికి వరంగల్ దగ్గరవుతుంది. జమ్మికుంటకు, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు మానేరుపై వంతెన నిర్మాణంతో దూరం తగ్గుతుంది. నిధులు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ విజ్జన్నకు కృతజ్ఞతలు.
– బొంగోని రమా, సర్పంచ్, రూపునారాయణపేట


