● ట్రాన్స్‌జెండర్లతో డీఎస్పీ శ్రీనివాసులు
వేములవాడ: ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ట్రాన్స్‌జెండర్స్‌ను హెచ్చరించారు. వేములవాడటౌన్, రూరల్ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లకు ఠాణాలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంతోపాటు ఇతర ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. శాపనార్థాలు పెట్టడం, బలవంతంగా డబ్బులు వ సూలు చేయడం, శుభకార్యాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి చర్యలపై ఫిర్యాదులు అందితే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. గౌరవానికి భంగం కలిగితే తమను సంప్రదించాలన్నారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.


