రైస్‌ మిల్లు యజమాని అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లు యజమాని అరెస్టు

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

వీణవంక: మండలంలోని కోర్కల్‌ గ్రామ శివారులోని వాసవి ఎంటర్‌ ప్రైజెస్‌ రైస్‌మిల్లు యజమాని నార్ల వెంకటేశ్వర్లును స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈనెల 5న హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రైస్‌మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 23.80 క్వింటాల పీడీఎస్‌ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌ కుర్ర తిరుపతి విచారించగా వివిధ గ్రామాల్లో కిలోకు రూ.20ల చొప్పున బియ్యాన్ని సేకరించి రైస్‌మిల్లు యజమాని నార్ల వెంకటేశ్వర్లు వద్ద రూ.25ల చొప్పున విక్రయిస్తున్నాడు. సదరు రైస్‌మిల్లు యజమాని కోళ్ల ఫారంలకు కిలోకు రూ.30 ల చొప్పున అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నార్ల వెంకటేశ్వర్లును శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. వెంకటేశ్వర్లు సీఎంఆర్‌ ఎగవేతలోనూ నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement