అలుగునూర్‌లో దీక్షా దివస్‌ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

అలుగునూర్‌లో దీక్షా దివస్‌ ఏర్పాట్లు

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

కరీంనగర్‌టౌన్‌/తిమ్మాపూర్‌: ఈనెల 29న అలుగునూర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్‌ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో సభకు భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులను తరలించేందుకు నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శుక్రవారం అలుగునూర్‌లో సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభ నిర్వహణకు అనువైన స్థలం, వేదిక ఏర్పాటు, ప్రజలు, కార్యకర్తలు కూర్చునేందుకు అవసరమైన ప్రాంగణం తదితర అంశాలను పరిశీలించారు. పార్కింగ్‌ ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో సభకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడటంతో నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని నాయకులు భావిస్తున్నారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, మానకొండూర్‌ మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్‌, కొత్తపల్లి మండల మాజీ వైస్‌ ఎంపీపీ తిరుపతినాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement