యాసంగిలో వరికి బదులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అవగాహన కల్పిస్తున్నా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్పడే అవకాశముందని ఖేత్ అభియాన్‌లో శాస్త్రవేత్తలు, అధికారులు సూచించినా పట్టించుకోవడం లేదు. మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, చామనపల్లి, నగునూరు తదితర గ్రామాల్లో రైతులు నారుమడులు సిద్ధం చేయడంతోపాటు నార్లు పోస్తున్నారు. బావుల్లో నీటి లభ్యత, ఆరుతడి పంటల సాగులో కోతుల బెడద కారణంగా వరి వైపు మొగ్గు చూపుతున్నామని రైతులు చెబుతున్నారు. – కరీంనగర్‌రూరల్


