పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించాలి

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌సిటీ: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల పట్ల అభిరుచిని పెంపొందించడంలో జిజ్ఞాస కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జిజ్ఞాస రాష్ట్రస్థాయి పోటీల బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. యువత పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలో ఎదురవుతున్న సమస్యలను పరిశోధనా దృక్పథంతో విశ్లేషించి, వాటికి పరిష్కారాలను కనుగొనే దిశగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఆర్థిక శాస్త్ర విభాగంలో హుస్నాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల బృందం డాక్టర్‌ ఇంద్రనైనా దేవి మార్గదర్శకత్వంలో ద్వితీయ బహుమతి సాధించింది. రసాయన శాస్త్ర విభాగంలో కరీంనగర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల బృందం డాక్టర్‌ మొగిలి మార్గదర్శకత్వంలో, తెలుగు విభాగంలో కరీంనగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల బృందం డాక్టర్‌ వెంకటరమణ మార్గదర్శకత్వంలో ద్వితీయ బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు మేయర్‌ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, 22వ వార్డు కార్పొరేటర్‌ రమణారెడ్డి, కళాశాల వైస్‌ ప్రిన్సిపాళ్లు పి.నితిన్‌, టి. రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. సురేందర్‌రెడ్డి, జిజ్ఞాస కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బి. ప్రభాకర్‌, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement