● ఆందోళనకు గురైన ప్రయాణికులు
తిమ్మాపూర్: కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సులో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఎమర్జెన్సీ అలారం మోగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తమై తిమ్మాపూర్ శివారులో బస్సును నిలిపివేయగా, ప్రయాణికులు భయంతో కిందకు దిగారు. అలారం ఎంతకూ ఆగకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. బస్సు బ్రేక్‌డౌన్ కావడంతో ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటులో అధికారులు జాప్యం చేశారని ప్రయాణికులు ఆరోపించారు. విమానాశ్రయానికి వెళ్లాల్సిన వారు ఫ్లైట్ మిస్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.


