సంక్షిప్త వార్తలు జాతీయస్థాయి
క్రీడా పోటీలకు విద్యార్థులు
రాష్ట్ర స్థాయి పోటీలకు.. చొప్పదండి/జమ్మికుంట: ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు చొప్పదండి, జమ్మికుంట మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు ఎంపికయ్యారు. చొప్పదండి మండలం ఆర్నకొండ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినులు జె. స్పందన, ఇ. కీర్తి అండర్–14 హాకీ విభాగంలో జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 13 నుంచి కామారెడ్డిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీఈటీ చంద్రశేఖర్ తెలిపారు. హెచ్‌ఎం దీక్షితుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. జమ్మికుంట మండలం కోరపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులు ఇంజం రితిక, గుండ్ల వైష్ణవి అండర్–17 హ్యాండ్‌బాల్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీ జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఎంఈవో హేమలత, గ్రామస్థులు అభినందించారు. ‘అనుమతులున్నా
అడ్డుకుంటున్నారు’
తిమ్మాపూర్: అన్ని అనుమతులు ఉన్నప్పటికీ మామూళ్ల కోసం మట్టి క్వారీ పనులను అడ్డుకుంటున్నారని నిర్వాహకుడు గొల్లెన తిరుపతి ఆరోపించారు. గురువారం తిమ్మాపూర్‌లో మాట్లాడారు. పోలంపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 69లో మట్టి తవ్వకాల కోసం అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 5 వరకు మైనింగ్ శాఖ నుంచి తాత్కాలిక అనుమతి పొందినట్లు తెలిపారు. పనులు ప్రారంభించాక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, నర్సింగాపూర్ సర్పంచ్ పెరుక రవి ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.4 లక్షలు డిమాండ్ చేశారని ,రూ.2 లక్షలు ఫోన్‌పే, నగదు రూపంలో చెల్లించినప్పటికీ మిగిలిన మొత్తం కోసం వేధించారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుమతులు రద్దు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లను గురువారం గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ కరీంనగర్ జిల్లా చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. నియన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, గతంలో సహకార సంఘాల ద్వారా గొర్రెల పెంపకందారులకు మంజూరైన ఎన్‌సీడీసీ రుణాల కారణంగా పెంపకందారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించి, ఆ రుణాలను మాఫీ చేయాలని కోరారు. మంత్రులు, పశుసంవర్ధక శాఖ ఎండీతో మాట్లాడి కరీంనగర్ జిల్లా యూనియన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ● ఉచిత పశువైద్య శిబిరం
రామడుగు: మండలంలోని దత్తోజీపల్లి గ్రామంలో గురువారం పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.
● ఆర్థికసాయం
రామడుగు: మండల కేంద్రానికి చెందిన బత్తిని విమల ఇటీవల మృతి చెందారు. సింగిల్ విండో మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్‌రావు సమకూర్చిన రూ.10 వేలు గురువారం పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు.
● టీచర్ పోస్టుకు 8 మంది దరఖాస్తు
ఇల్లందకుంట: మండలంలోని గడ్డివానిపల్లి అంగన్‌వాడీ టీచర్ పోస్టు భర్తీకి సంబంధించి మొత్తం 8 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఐసీడీఎస్, సీడీపీవో ప్రవళిక తెలిపారు.
● పోరాటాలతోనే పరిష్కారం
హుజూరాబాద్: కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. గురువారం పట్టణంలోని హమాలీ కార్యాలయంలో కదిరే రమేశ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు.
● ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి
సైదాపూర్: మండలంలో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తున్న కమిటీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ డిమాండ్ చేశారు. కమిటీ సభ్యులు, అధికారులు కుమ్మకై ్క డబ్బులు ఇచ్చిన వారికి, బంధువులకు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు సిఫారసు చేస్తున్నారని ఆరోపించారు.
● మైలారంలో భూభారతి రీ సర్వే
గన్నేరువరం: మండలంలోని మైలారం గ్రామంలో భూభారతి రీ–సర్వే పనులను గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. సర్వే కొలతలు, హద్దులు, సర్వే ప్రక్రియ గురించి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.
● అభివృద్దిపై సమీక్ష సమావేశం
జమ్మికుంట: ఎల్‌నినో నేపథ్యంలో జమ్మికుంటను కరువు మండలంగా ప్రకటించాలని సర్పంచులు డిమాండ్ చేశారు. గురువారం ఎంపీడీవో పద్మావతి ఆధ్వర్యంలో, స్పెషల్ ఆఫీసర్ లింగారెడ్డి అధ్యక్షతన మండల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.
● వన్‌వే ఫోర్‌లైన్ ప్రారంభం
చిగురుమామిడి: మండలంలోని సుందరగిరి శివారులో ఆర్‌అండ్‌బీ ఫోర్‌లైన్ వన్‌వే రాకపోకలను గురువారం హుస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, చిగురుమామిడి ప్యాక్స్ చైర్మన్ రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు.
● అప్రమత్తంగా ఉండాలి
హుజూరాబాద్ రూరల్: ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్‌లో తాగునీటి కొరతతోపాటు పలుఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో నాయక్‌వాడి జలకుమారి అన్నారు. గురువారం ఐకేపీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
● ఎరువుల షాపుల్లో తనిఖీ
గన్నేరువరం: మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డీసీఎంఎస్, గ్రోమోర్ షాపులను గురువారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి చత్రునాయక్ తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
● రేషన్ షాపు ప్రారంభం
గన్నేరువరం: గుండ్లపల్లి స్టేజీలో రేషన్ షాపును గురువారం ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ చింతల ఉమారాణి ప్రారంభించారు. నూతన పంచాయతీ ఏర్పాటుతో రేషన్ షాపును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. లబ్ధి దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
● దరఖాస్తుల ఆహ్వానం
గన్నేరువరం: తిమ్మాపూర్ మండలంలో నిర్వహిస్తున్న గన్నేరువరం మండల కేజీబీవీలో వెట్ స్వీపర్‌గా పనిచేయడానికి మండలంలోని ఆసక్తి గల మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రామయ్య గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీలోగా మండల విద్యా వనరుల కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
● బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ
జమ్మికుంట: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలి కల ఉన్నత పాఠశాలలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో బాల్య వివాహాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.
● భూమిపూజ
శంకరపట్నం: కన్నాపూర్ పరిధిలోని కిష్కిందపల్లెలో మహిళా సంఘం భవన నిర్మాణానికి సర్పంచ్ రమ గురువారం భూమిపూజ చేశారు.
● ఎంపీడీవోకు వినతి
శంకరపట్నం: తాడికల్ గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవనం నిర్మించవద్దని కోరుతూ ఉపసర్పంచ్ గురువారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
● విజయవంతం చేయాలి
చొప్పదండి: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ నెల 18న నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకుడు తాడూరి శివకృష్ణ పిలుపునిచ్చారు.
● ఖేత్ బచావో అభియాన్
చిగురుమామిడి/హుజూరాబాద్‌రూరల్/చొప్పదండి: యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసి నీటిని ఆదా చేయాలని డీఏవో ఛత్రునాయక్ సూచించారు. చిగురుమామిడి రైతువేదికలో ఖేత్ బచావో అభియాన్ సదస్సులో మాట్లాడారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో సర్పంచ్ కస్తూరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త మహేశ్, ఏడీఏ సునీత, ఏవో భూమిరెడ్డి అవగాహన కల్పించారు. చొప్పదండి మండలం రాగంపేటలో ఖేత్ బచావో అభియాన్ నిర్వహించారు. రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, చీడపీడల యాజమాన్యంపై దృష్టి సారించాలని కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి కోరారు.
● కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చొప్పదండి: వెదురుగట్ట, రాగంపేట, పెద్దకూర్మపల్లి, దేశాయిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్యాక్స్ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, ఎన్నం మనోహర్ గురువారం ప్రారంభించారు.
● బండి సంజయ్ పరామర్శ
చిగురుమామిడి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పైడిపెల్లి శ్రీకాంత్, ఆయన కుమార్తె మహాన్విక చిత్రపటాలకు కొండాపూర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం నివాళులర్పించారు. చిగురుమామిడిలో దొంత కరుణాకర్ తండ్రి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
● నియామకం
రామడుగు (చొప్పదండి): కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గోపాల్‌రావుపేటకు చెందిన కర్ర సత్యప్రసన్నరెడ్డి మూడోసారి నియమితులయ్యారు. గురువారం గాంధీ భవన్‌లో జాతీయ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు అల్కా లాంబా, ఎర్రబెల్లి స్వర్ణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
● బీసీ సంక్షేమ సంఘం కమిటీ
రామడుగు: మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అనుపురం పర్శరాంగౌడ్, ప్రధాన కార్యదర్శిగా మాడిశెట్టి జయంత్, యువజన అధ్యక్షుడిగా మామిడి రాజశేఖర్ నియమితులయ్యారు. అలాగే గంగాధర మండల అధ్యక్షుడిగా రేండ్ల అంజయ్య, యువజన అధ్యక్షుడిగా సంజీవ్‌కుమార్, మహిళా అధ్యక్షురాలిగా జంగిలి లక్ష్మిని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
● గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
జమ్మికుంట: కోరపల్లికి చెందిన గీత కార్మికుడు గండి చంద్రమోహన్‌గౌడ్ గురువారం తాటిచెట్టు పైనుంచి జారిపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
● చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్
సప్తగిరికాలనీ(కరీంనగర్): జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా గురువారం నిర్వహించిన పాఠశాలస్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పరీక్షలు ఉత్సాహంగా జరిగాయి. 8.9.10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు భాషలో నిర్వహించిన ప రీక్షకు సుమారు 4వేల మంది హాజరయ్యారు.
కరీంనగర్‌టౌన్: శ్రీచైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు క్రీడారంగంలో ప్రతిభ చాటుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్‌జీఎఫ్ అండర్–19 తైక్వాండో విభాగంలో వాసరి హారిక, కల్వ రోషిణి ఎంపిక కాగా, కబడ్డీ విభాగంలో ఎర్రవెల్లి అభినయశ్రీ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి విద్యార్థులను అభినందించి సత్కరించారు. క్రీడలతో పాటు విద్యార్థులు విద్యా, క్రీడా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, సెక్రటరీ ముద్దసాని సాయి చైతన్యరెడ్డి, శ్రీచైతన్య జూనియర్ కళాశాలల డీన్ జగన్‌మోహన్ రెడ్డి, డిఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ పల్లె శ్యాంసుందర్ రెడ్డి, ఫిజికల్ అడ్వైజర్ లెంకల మహిపాల్ రెడ్డి, ఏజీఎం శ్రీనివాస్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.
మంత్రులను కలిసిన ప్రతినిధులు