శాతవాహన వర్సిటీలో మట్టి తవ్వకాలు, చెట్ల నరికివేత, వన్యప్రాణుల ఆవాసాల విధ్వంసంపై బుధవారం కామర్స్ బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్, లా డిపార్ట్మెంట్, సైన్స్ బ్లాక్‌లకు చెందిన విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్సిటీ జేఏసీ చైర్మన్ కరికె మహేశ్, అధ్యక్షుడు కేశవ్, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ శివాజీ, శంకర్, ప్రవీణ్, ఓంప్రకాశ్, లక్ష్మణ్ సాయి, శ్యామ్ సుందర్ రెడ్డి, సందీప్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్‌సిటీ


