విద్యావ్యవస్థను బలోపేతం చేసిన గొప్ప వ్యక్తి | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థను బలోపేతం చేసిన గొప్ప వ్యక్తి

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: దేశ తొలి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఆజాద్‌ జయంతి సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి మేయర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశంలో ఆధునిక విద్యాసంస్థల ఏర్పాటుకు ఆజాద్‌ పునాదులు వేశారన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయి, సహాయ కమిషనర్‌ రాజమనోహర్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌, ఎంఐఎం నగర అధ్యక్షుడు అథిన్‌, కార్పొరేటర్లు, నాయకులు మోసిన్‌, మాజిద్‌, యూసుఫ్‌, బియాబని, అమీర్‌, జమ్ము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement