● మహిళ మృతి ● పది మందికి గాయాలు
మెట్పల్లి: కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటన మెట్పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. వెల్లుల్ల రోడ్ నుంచి లింగం అనే వ్యక్తి తన ఆటోలో పది మందికి పైగా ప్రయాణికులను ఎక్కించుకొని బండలింగాపూర్‌కు తీసుకెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే అడ్డొచ్చిన కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఈ సంఘటనలో నాగేల్లి లక్ష్మమ్మ(60), పది మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. లక్ష్మమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కిరణ్‌కుమార్ పరిశీలించి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి ఆరపేట జాతీయ రహదారిపై గేదెను తప్పించబోయి ఓ ఆటో బోల్తాపడి సంఘటనలో తొమ్మిది మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


