పేద దళితుడి మృతదేహం గ్రామానికి తరలింపు | - | Sakshi
Sakshi News home page

పేద దళితుడి మృతదేహం గ్రామానికి తరలింపు

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

● ఎమ్మెల్యే ఆదేశంతో కదలిన కార్యకర్తలు

● ఎమ్మెల్యే ఆదేశంతో కదలిన కార్యకర్తలు

కాశిబుగ్గ : కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మహాత్మనగర్‌కు చెందిన పేద దళితుడైన కన్న లక్ష్మ య్య అనారోగ్యంతో వరంగల్‌ ఎంజీఎంలో చనిపోగా, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాని పరిస్థితి. ఇప్పటికే మృతుడి కుమారుడు డయాలసిస్‌ చేసుకోగా, చిన్న కుమార్తె దివ్యాంగురాలు కావడంతో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వీరి పరిస్థితి తెలుసుకున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్‌ చిలువేరు శ్రీనివాస్‌ ఆదేశాలతో వరంగల్‌ జిల్లా నుంచి జన్ను గణేష్‌, బొమ్మెర నరేందర్‌, ఇల్లందుల సమ్మయ్య , పాల కుమారస్వామిలు లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు దగ్గర ఉండి సహాయ సహకారాలు అందించారు. వారి భోజన సౌకర్యం కల్పించారు. అంబులెన్స్‌ ఏర్పాట్లు చేయించి మృతదేహాన్ని మహాత్మనగర్‌కు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement