తోటి కార్మికుడిపై కోపంతో హత్య | - | Sakshi
Sakshi News home page

తోటి కార్మికుడిపై కోపంతో హత్య

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

● సుత్తితో కొట్టి చంపిన యువకుడు ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

● సుత్తితో కొట్టి చంపిన యువకుడు ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

సైదాపూర్‌: తోటి కార్మికుడి పనితీరును యజమాని మెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేని మరో కార్మికుడు కోపంతో సుత్తితో కొట్టి హత్య చేశాడు. సైదాపూర్‌ మండలం ఘనపూర్‌ శివారులో జరిగిన హత్య కేసు వివరాలను బుధవారం సైదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హుజూరాబాద్‌ ఏసీపీ వాసంశెట్టి మాధవి వెల్లడించారు. మాణిక్యాపూర్‌కు చెందిన పచిమట్ల అజయ్‌ (21), పత్తిపాక సాయికుమార్‌ (28) హుజూరాబాద్‌లోని ఓ మెకానిక్‌ షాపులో పనిచేస్తున్నారు. అజయ్‌ పనితీరును యజమాని మెచ్చుకోవడం, సాయికుమార్‌ను మందలించడంతో అజయ్‌పై సాయికుమార్‌ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 9న అజయ్‌ను బైక్‌పై ఘనపూర్‌ శివారుకు తీసుకెళ్లి మద్యం తాగాలని కోరగా నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సాయికుమార్‌ సుత్తితో తలపై కొట్టడంతో అజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు సాయికుమార్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఏసీపీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement