తిమ్మాపూర్: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన సిరికొండ శ్యాంసుందర్రావును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.. కేటీఆర్ పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ బల్మూరు వెంకట్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టాడు. బల్మూర్ వెంకట్ భార్య హిందూజా గురించి పోస్ట్ పెట్టిన నేపథ్యంలో ఆమె హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి శ్యాంసుందర్రావు గురించి ఆరా తీశారు. పది రోజులుగా శ్యాంసుందర్రావు పోలీసులకు చిక్కకుండా తిరిగారు. తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మందులు తీసుకుని ఇంటికి వెళ్లిన ఆయనను పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లనున్నట్లు సమాచారం.


