వేములవాడ అర్బన్: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థి భానుప్రకాశ్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపాడు. భాను ప్రకాశ్ వేములవాడలో జరిగిన అండర్–20 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు బిహార్‌లోని పాట్నాలో నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటాడు. భానుప్రకాశ్‌ను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శంకర్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్‌రావు అభినందించారు.


