వైద్య పరీక్షలతోనే నిర్ధారణ | - | Sakshi
Sakshi News home page

వైద్య పరీక్షలతోనే నిర్ధారణ

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

న్యూమోనియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. రోగి లక్షణాలు, శ్వాసక్రియ, శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయిలను బట్టి ఛాతీ ఎక్స్‌రే, రక్త పరీక్షలు, కఫం పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను నిర్ధారించవచ్చు. బ్యాక్టీరియా వల్ల వచ్చిన న్యూమోనియాకు యాంటీబయాటిక్స్‌, వైరస్‌ వల్ల వచ్చినప్పుడు పరిస్థితిని బట్టి యాంటీవైరల్‌ మందులు, ఇతర సహాయక చికిత్స ఉంటుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆసుపత్రిలో చికిత్స, ఆక్సిజన్‌ అందిస్తారు. పరిస్థితి విషమిస్తే ఐసీయూలో చికిత్స అవసరమవుతుంది. సొంతంగా మందులు వాడటం, వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం, మధ్యలోనే మందులు ఆపేయడం చేయకూడదు. న్యూమోనియా పూర్తిగా నయం అయ్యే వ్యాధే అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.

– డాక్టర్‌ రవీంద్రచారి, పల్మనాలజిస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement