ప్రాణాంతకం.. న్యూమోనియో | - | Sakshi
Sakshi News home page

ప్రాణాంతకం.. న్యూమోనియో

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

● చలికాలంలో పెరుగుతున్న వ్యాధి ముప్పు ● చిన్నారులు, వృద్ధుల్లో అధిక ప్రభావం ● నేడు న్యూమోనియా నివారణ దినోత్సవం జాగ్రత్తలతో వ్యాధికి అడ్డుకట్ట

కరీంనగర్‌: చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో న్యూమోనియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాధారణ జలుబు, దగ్గుగా మొదలయ్యే ఈ వ్యాధి.. క్రమంగా ఊపిరితిత్తులకు వ్యాపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వైరస్‌లు, బ్యాక్టీరియా, కొన్ని సందర్భాల్లో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లతో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో ద్రవం లేదా చీము చేరి శ్వాసక్రియకు ఆటంకం కలుగుతుంది. ఈనెల 12న న్యూమోనియా నివారణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం.

న్యూమోనియా బారినపడకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో అవసరం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా చేతిరుమాలు లేదా టిష్యూ ఉపయోగించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండాలి. పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు న్యూమోకాకల్‌ వ్యాక్సిన్‌, ఇన్‌ఫ్లుయెంజా టీకాలు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement