కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా అల్గునూర్‌లోని తెలంగాణ మహిళా ఎమర్జింగ్ స్టార్స్ టీ20 క్రికెట్ టోర్నమెంట్.. మైదానంలో హోరాహోరీ పోరు, ప్రతీ బంతికి ఉత్కంఠ కలిగిస్తోంది. బ్యాటింగ్‌లో భారీ షాట్లు బాదుతూ పరుగుల వేట సాగిస్తుంటే.. బౌలర్లు పదునైన బంతులతో వికెట్లు పడగొడుతున్నారు. మరోవైపు ఫీల్డర్లు కళ్లు చెదిరే క్యాచ్‌లతో మ్యాచ్‌లో ఉత్కంఠను పెంచుతున్నారు. బ్యాటర్ బ్యాట్ ఝుళిపిస్తున్న దృశ్యం.. బౌలర్ ధాటికి క్లీన్‌బౌల్డ్.. గాల్లోకి దూసుకొచ్చిన బంతిని ఒడిసిపట్టిన ఫీల్డర్.. ఇలా పలు దృశ్యాలు పోరాట పటిమ, నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. క్రికెట్ మైదానం మహిళా క్రికెటర్ల ఆటతీరుతో సందడిగా మారింది.
క్లీన్‌బౌల్డ్..
సూపర్ క్యాచ్..


