కరీంనగర్సిటీ: రాష్ట్రస్థాయిలో నిర్వహించే వికసిత్ భారత్ యువ పార్లమెంట్–2027 పోటీలకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. నషా ముక్త యువ–వికసిత్ భారత్ అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానంలో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ విద్యార్థి ఎం.అఖిల, ద్వితీయ స్థానంలో అమిగోస్ అకాడమీకి చెందిన కనక్ ముండాడా, తృతీయ స్థానంలో ఎస్ఆర్ఆర్ కాలేజీకి చెందిన త్రిలోచన్ ఎంపికయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న వారు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. జిల్లా యువజన అధికారి జి.తిరుపతిరెడ్డి, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి కరీంనగర్ జిల్లా, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.


