‘నా కొడుకు కలను నెరవేర్చండి’
’
జగిత్యాలక్రైం: సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న తన కుమారుడు కోపర్తి అభిలాష్ కలను నెరవేర్చేందుకు అతడిని అబుదాబి నుంచి రెండువారాల సెలవుపై ఇండియాకు రప్పించాలని ఎండపల్లి మండలం పాతగూడూరుకు చెందిన సుమలత సీఎం ప్రజావాణితోపాటు స్టేట్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డికి ఈనెల 3న వినతిపత్రం అందించారు. ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం అబుదాబి వెళ్లిన అభిలాష్.. అక్కడ ఆల్ఫామెడీ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయన ఈనెల 16న హైదరాబాద్‌లో జరగనున్న అగ్నివీర్ నియామక ప్రక్రియలో శారీరక దేహదారుఢ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే అక్కడి కంపెనీ సెలవు ఇవ్వడం లేదని సమాచారం. సుమలత వినతి మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీంకు ఫోన్ చేసి అభిలాష్‌ను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని లేక రాశారు. వారు అబుదాబిలోని ఇండియన్ ఎంబసీకి లేఖ రాసి.. యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఇచ్చింది.


