● సర్పంచ్‌తోపాటు మరో ఐదుగురిపై దాడి ● 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు
చిగురుమామిడి: మండలంలోని రేకొండ గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. వాటి దాడిలో సర్పంచ్‌తో పాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీధికుక్కలు సోమవారం సాయంత్రం దుడ్డేల రాజవ్వ, బూదవ్వ, మోరె లక్ష్మి, ఓ బాలుడిపై దాడికి పాల్పడ్డాయి. లక్ష్మికి తన మనుమడిని కాపాడే క్రమంలో కుడిచేయి మణికట్టు భాగం విరిగింది. ఎడమ మోచేయి కింది భాగంపై విక్షణరహితంగా కరిచింది. గందె కన్నయ్య (3) ఎడమచేతిపై రెండు చోట్ల కరిచింది. గ్రామస్తుల సమాచారంతో సర్పంచ్ సంపత్ కుక్కలను తరిమేందుకు కట్టెతో వెళ్లగా.. అతడిపైనా దాడిచేసి గాయపర్చాయి. స్థానికులు బాధితులను 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుక్కల దాడిని భరించలేకపోతున్నామని, పంచాయతీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గాయపడిన
దుడ్డేల బూదవ్వ
గాయపడిన సర్పంచ్ అల్లెపు సంపత్


