ఆగని ముంపు పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఆగని ముంపు పోరాటం

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

గంగాధర: మండలంలోని నారాయణపూర్‌ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 77వ రోజు కొనసాగాయి. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా తమ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని, గ్రామస్తులపై నమోదు చేసిన కేసులు ఎత్తి వేయాలని రిలే దీక్షలు చేపట్టారు. శనివారం గ్రామంలో రిజర్వాయర్‌ సర్వేకు అధికారులు వస్తున్నారని గ్రామంలో దండోరా వేశారు. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించే వరకు ఏ అధికారి తమ ఊరికి రానివ్వమని గ్రామ శివారులోని పాఠశాల వద్ద రోడ్డుపై బైటాయించారు. సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement