ఖాతా ఇస్తే కటకటాలే! | - | Sakshi
Sakshi News home page

ఖాతా ఇస్తే కటకటాలే!

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

మ్యూల్‌ఖాతా మాఫియాపై పోలీసుల నిఘా కమిషనరేట్‌ పరిధిలో 29 కేసుల్లో 122 మంది నిందితులు ఇప్పటి వరకు 89 మందిపై చర్యలు మరో 33 మందిపై కేసులు పెండింగ్‌ కమీషన్ల ఆశతో ఖాతాలు ఇస్తున్న పలువురు

కరీంనగర్‌ క్రైం: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? ఆ ఖాతాను ఎవరికై నా గుర్తు తెలియని వ్యక్తులకు ఇస్తున్నారా? మీ అకౌంట్లో తరచూ డబ్బులు జమవుతూ.. మాయమవుతున్నాయా? ఇలా జరిగితే ఇక మీరు కటకటాల్లోకి వెళ్లినట్లే.. మీ బ్యాంకు ఖాతాతో పాటు మీపై పోలీసు నిఘా ఉన్నట్లే. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇస్తూ, అమాయకుల సొమ్ము దోచుకునే ముఠాలకు సహకరిస్తున్న వారిపై కరీంనగర్‌ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. సైబర్‌మోసాల లావాదేవీలకు వేదికగా మారుతున్న మ్యూల్‌ బ్యాంకు ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ ఘటనల్లో కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు 29 కేసులు నమోదు చేసి, 122 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 89 మందిపై అరెస్టులు, చట్టపరమైన నోటీసుల రూపంలో చర్యలు తీసుకున్నారు. మరో 33మందిపై కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సీపీ గౌస్‌ఆలం వెల్లడించారు.

ఖాతాదారులే నిందితులుగా

సైబర్‌ నేరగాళ్లు తమ గుర్తింపును దాచిపెట్టి, ఇతరుల బ్యాంకు ఖాతాల ద్వారా మోసపూరితంగా సంపాదించిన డబ్బును బదిలీ చేస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కమీషన్లు ఆశచూపి పలువురి బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఇతర బ్యాంకింగ్‌ వివరాలను సేకరించి నేరాలకు వినియోగిస్తున్న తీరుపై దృష్టి సారించారు. ఇలాంటి ఖాతాలను మ్యూల్‌ అకౌంట్లుగా భావిస్తారని, తమ ఖాతాలను ఇతరులు వినియోగించేందుకు ఇస్తే తప్పు చేసినట్లేనని హెచ్చరిస్తున్నారు. ఖాతా ద్వారా జరిగిన లావాదేవీల స్వభావం, సంబంధిత వ్యక్తిపాత్ర, నేరంలో ప్రమేయం వంటి అంశాల ఆ ధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement