● ఎస్‌ఐఆర్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగింత
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుదీర్గ విరామం అనంతరం పురుమల్ల శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తూ పార్టీ ఆదేశాలు జారీచేసింది. ఇటీవల పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎస్‌ఐఆ కార్యక్రమాలు కో ఆర్డినేటర్‌తో కలిసి శ్రీనివాస్ నిర్వహించాల్సి ఉంటుంది. కాగా ఎస్‌ఆర్‌ఐ కరీంనగర్ క్లస్టర్‌కు ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులుగా నియమితులైన శరత్, శ్రీశైలం గౌడ్ ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.


