ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు కల్పించాలి

Oct 25 2026 12:11 AM | Updated on Oct 25 2026 12:11 AM

కరీంనగర్‌క్రైం: సమాజంలో ట్రాన్స్‌జెండర్ల విషయంలో వివక్షను విడనాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి యశ్వంత్‌ సింగ్‌ సూచించారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులు, న్యాయసాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలపై కరీంనగర్‌లోని డీఎల్‌ఎస్‌ఎ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. యశ్వంత్‌సింగ్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. చేతన సంస్థ అధ్యక్షుడు కోట శివకుమార్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు విద్య, ఉపాధి, ఆస్తి హక్కులు, గుర్తింపు పత్రాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ అర్హులకు గుర్తింపు కార్డులు, రుణాలు, సంక్షేమ పథకాల ద్వారా సహకారం అందిస్తామన్నారు. డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావు, సీఐ పుల్లయ్య, బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి పాల్గొన్నారు.

జాతీయ సదస్సులో కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: దేశంలోని పట్ట ణ ప్రాంతా ల సమగ్ర అభివృద్ధి, వసతుల క ల్పనపై ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శని వారం నిర్వహించిన జాతీయ అర్బన్‌ సదస్సుకు కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ హాజరయ్యారు. కరీంనగర్‌లో చేపట్టిన నివాస, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, వినూత్న ప్రాజెక్టులపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో కరీంనగర్‌ రూపురేఖలు ఎలా మారాయి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా అభివృద్ధి చేసిన ఆధునిక పార్కులు, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సమీకత కూరగాయల మార్కెట్లు తదితర అంశాలపై ప్రసంగించారు. పట్టణాభివృద్ధికి అర్బన్‌ చా లెంజ్‌ ఫండ్‌ కింద భవిష్యత్తులో చేపట్టబోయే కీలక ప్రాజెక్టుల గురించి వివరించారు.

రైతులు వరిసాగు తగ్గించాలి

మానకొండూర్‌: ఎల్‌నినో కారణంగా తీవ్ర కరువు రాబోతోందని, దాన్ని అధిగమించేందుకు రైతులు వరిసాగు తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రూనాయక్‌ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆత్మ ద్వారా చెంజర్ల రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఛత్రూనాయక్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం ఉన్నందున రైతులు వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని సూచించారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ద్వారా వేరుశనగ విత్తనాలు బై బ్యాక్‌ అగ్రిమెంట్‌ ద్వారా కొనుగోలు చేస్తారని, 100శాతం రాయితీపై ప్రొద్దుతిరుగుడు విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ గొల్లెన కనకమ్మ, వ్యవసాయ సహాయ సంచాలకుడు శ్రీధర్‌, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌రెడ్డి, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, ఏఈవో శ్రీలత, హార్టికల్చర్‌ అధికారి క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

ఆయుష్‌శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ

కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వ ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఆయుష్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ నిర్వహణకు కాంట్రాక్టు పద్ధతిలో 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్యాధికారులు 3, ఫార్మసిస్ట్‌ 1, సైకో సోషల్‌ కౌన్సెలర్‌ 1, యోగా ప్రొఫెషనల్‌ 1, మల్టీపర్పస్‌ వర్కర్‌ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు 18 నుంచి 44 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అభ్యర్థులు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం కరీంనగర్‌ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement